
నీ అందం తో నా ప్రేమను పొల్చద్దు ; చందమామకి చెక్కముక్కకు తేడా ఉంది
నీ నవ్వుల వెలుగులో నా హృదయాన్ని చూడద్దు; అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది
నీ వలపుల వెల్లువలో నన్ను ముంచొద్దు; నాకు కన్నీరు కూడా దూరమవుతుంది
నీ కాటుక కళ్ళతో నా ఉపిరి ఆపొద్దు; నీకు దూర మైఎందుకు సమయమేముంది
నీ కాళ్ళ పారాణి ఆరపెట్టొద్దు ; నా చితిమంటల వేడి దానికి సరిపోతుంది
దయచేసి నా చితివైపు రావద్దు; నీ కళ్ళల్లో పడే బూడిద అది కన్నీరునుకొంటుంది
నీ జ్ఞాపకాలలో నను దరిచేరనీయకు; అది నీకేమంత కష్టమవుతుంది
No comments:
Post a Comment