
వసంతంలో వికసించిన పువ్వులను చూసి పరవశించి పాడిన కోయల గానాన్ని వింటున్నప్పుడైన నేను గుర్తుకు రానా ?
శరత్కాల వెన్నెలలో పరిమళాలు వెదజల్లు పారిజాత పుష్పాల సువాసనను ఆస్వాదిస్తున్నప్పుడైన నేను గుర్తుకు రానా ?
ప్రకృతి రాత్రి ఒడిలో నిద్రపోయేవేల అందమైన తారతో సైయ్యటలాడే చంద్రుని చూస్తున్నప్పుడైన నేను గుర్తుకు రానా?
ఆకాశం నిండా మేఘాలు అలముకొన్న వేళ ఆకాశం అంచు నుండి జారి పడ్డ నీటి బిందువును చూసి ఆనందించే వేళనైననేను గుర్తుకు రానా?
భూమిని చేరే మొట్టమొదటి సూర్య కిరణం కోసం ఎదురుచూసే లక్షలాది పువ్వుల ఆతృతను చుస్తున్నప్పుడైన నేను గుర్తుకురానా ?
ఎప్పుడు ఒక చోట ఉండలేని ఆనందం మనసంతా నిండి, పొంగి ప్రవహించే మూసిఉన్న పెదవుల మద్య నుండి జారి చిరునవ్వు అనే పేరు తో ఇతరుల మనసులోకి దూకే ప్రయత్నాన్ని చూస్తున్నప్పుడైన నేను గుర్తుకురాన?
నీ ప్రేమలో కర్పూరంలా మండే నా హృదయపు వెలుగులో నువ్వు కాటుకలద్దె వేళనైన నేను గుర్తుకు రానా?
నా మనసు దాహాన్ని తీర్చలేని కన్నీరు నీ పాదాలను అభిషేకించే వేళనైన నేను గుర్తుకు రానా?
No comments:
Post a Comment