నీ జ్ఞాపకాలన్నీ మరచి పోవాలి నీ గుర్తులన్నీ చెరిగి పోవాలి ఇంకెప్పుడు నీ గురించి ఆలోచించకుండా అసలు నీ పేరే ఎప్పుడు వినిపించకుండా ఏమి చెయ్యాలి? అవును కంప్యూటర్ ఇంజనీర్ని కదా అందుకే ఈ రోజు నా మనసును ఫార్మేటు చేశాను హమయ్య ఇక నా దగ్గరే జ్ఞాపకం లేదు వర్షం తో చిక్కిన మేఘంలా ఉన్నాను ఇదేంటి మరీ ఇంత తేలికగా ఉన్నాను ? తెలుసు, నా నుండి విడదేయలేని నీ జ్ఞాపకాలతో పాటూ .. నేను కూడా కరిగిపోయాను నువ్వు లేని నేను ఒంటరిగా ఉండబోను
ఒక్క నీటి బిందువు చాలు మంచి ముత్యాన్ని నిర్మించడానికి ఒక్క వర్షపు చినుకు చాలు పుడమి తల్లిని పులకరింప చేయడానికి ఒక్క కాంతికిరణం చాలు కటికచీకటిని ప్రారద్రోలడానికి ఒక్క వెదురు ముక్క చాలు వెయ్యి గీతాలు ఆలపించడానికి ఒక్క నీ చిరునవ్వు చాలు మూగబోయిన నా హృదయ వీణని పలికించడానికి