Thursday, November 12, 2009

నా ఉద్యోగం







నిరుద్యోగికో ఉద్యోగం వచ్చింది!
ప్రతి ఉదయం పువ్వుల్లో సుగంధం నింపాలట
ప్రతి రాత్రి ఆకాశంలో తలుపులన్నీ మూయాలట
పున్నమికి చంద్రుణ్ణి అద్దంలా మెరిపించాలట
వెన్నెల దారులన్నీ మంచు పూలతో తుడవాలట
చైత్రంకోసం చినుకుల్ని తేవాలట
వర్షం వస్తే నీకు గొడుగులా మారాలట

నీ పాదాలకింద పడి మెరిసే గడ్డిపూలే నా జీతమట
సరే మరి నా మనసులోని మాట
ఇంతకన్నా అదృష్టం ఇక ఏముందంట

Thursday, April 9, 2009

నీ చేతుల్లో










కంప్యూటర్నై ఇంటర్నెట్ తో కలవాలని లేదు

కీబోర్డునై అక్షరాలు, అంకెలు దాచుకోవాలని లేదు

ఈమెయిలునై ఎక్కడికైనా ఎగరాలని లేదు

మౌసు నై నీ మెత్తని చేతుల్లో ఒదిగిపోవాలని ఉంది

Wednesday, April 8, 2009

ఫార్మేటు

నీ జ్ఞాపకాలన్నీ మరచి పోవాలి నీ గుర్తులన్నీ చెరిగి పోవాలి
ఇంకెప్పుడు నీ గురించి ఆలోచించకుండా
అసలు నీ పేరే ఎప్పుడు వినిపించకుండా
ఏమి చెయ్యాలి? అవును కంప్యూటర్ ఇంజనీర్ని కదా
అందుకే ఈ రోజు నా మనసును ఫార్మేటు చేశాను
హమయ్య ఇక నా దగ్గరే జ్ఞాపకం లేదు
వర్షం తో చిక్కిన మేఘంలా ఉన్నాను
ఇదేంటి మరీ ఇంత తేలికగా ఉన్నాను ?
తెలుసు, నా నుండి విడదేయలేని నీ జ్ఞాపకాలతో పాటూ ..

నేను కూడా కరిగిపోయాను
నువ్వు లేని నేను ఒంటరిగా ఉండబోను

Thursday, April 2, 2009

ప్రశ్న

నేను చిన్నతనం నుండి అతి తెలివైన వాడిని
ప్రశ్నకు ప్రశ్నతో బదులిచ్చే మేధావిని
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటే
పగలా రాత్రా అని అడిగే వాడిని
వర్షం వస్తే ఇంద్రధనుస్సు వస్తుంది అంటే
బాగా ఎండగా ఉంటే రాదా అనే వాడిని
జీవితాంతం ప్రేమించాలి అంటే
జన్మజన్మలకూ ప్రేమించకూడదా అనే వాడిని
నువ్వ్వు నన్ను పనికిమాలినవాడినని వదిలేస్తే
మూగ గొంతుతో నిలబడ్డ ప్రశ్నలు లేని వాడిని

Wednesday, April 1, 2009

ఒక్క చిరునవ్వు


ఒక్క నీటి బిందువు చాలు మంచి ముత్యాన్ని నిర్మించడానికి
ఒక్క వర్షపు చినుకు చాలు పుడమి తల్లిని పులకరింప చేయడానికి
ఒక్క కాంతికిరణం చాలు కటికచీకటిని ప్రారద్రోలడానికి

ఒక్క వెదురు ముక్క చాలు వెయ్యి గీతాలు ఆలపించడానికి
ఒక్క నీ చిరునవ్వు చాలు మూగబోయిన నా హృదయ వీణని పలికించడానికి

ఎవరన్నారు



 ఎవరన్నారు..?
అందమంతా హరివిల్లు లోనే ఉందని.?
అది నీ పెదవుల వంపు చూడని వాళ్ళ మాట


కాలం ఆగదని..?
అది నీ కాటుక కళ్ళ సోయగాన్ని చూడని వాళ్లమాట


ఆకాశం అనంతమైనదని..?
అది నీ ప్రేమకవిత్వం రాయని వాళ్ళ మాట
  


తపస్సు చేస్తే మోక్షం వస్తుందని..?
అది నీ పాదధూళి నంటని వాళ్ళ మాట



శరీరంతో స్వర్గానికి చేరోచ్చని..?
అది వెన్నెల దీపం లాంటి నీ మోముని చూసి చెప్పిన మాట

Tuesday, March 31, 2009

ఓ కోయల












మండు టెండలో మంచుపూల మాలలా
ఎడారిలో మంచినీటి చుక్కలా
కటిక చీకటిలో వెలుగు నిచ్చు దీపంలా
కఠిన హృదయంలో కాంతి నింపు ప్రేమలా
వసంతంలో వికసించిన అందంలా
ఏకాంతంలో పలకరించిన తోడులా
కడలిని చేరే వెన్నెల కిరణంలా
బడలిక తీర్చే మెత్తని పానుపులా
ఉషస్సులో
ప్రకాశిస్తున్న ప్రకృతిలా
మనస్సులో కలలు నింపుకొన్న కన్యలా
నీ పాట మమ్ములను పరవసింపచేయాలి ఎల్లవేళలా